jesus miracle

“Let everything that has breath praise the LORD. Praise the LORD.” (Psalm 150:6

Praise is indeed important in the Bible, and there are numerous verses that highlight its significance. Praise is a way to express gratitude, honour, and reverence to God. It acknowledges His greatness, faithfulness, and power.

1000 Praises  601 – 700

 

601 దరిద్రుల వంశమును రక్షించుటకై అతని కుడిప్రక్కన నిలిచియున్న దేవా  కీర్తనలు 109:31
602 దరిద్రులను పెంటకుప్ప మీద లేవనెత్తు దేవా  కీర్తనలు 113:8
603 దరిద్రులను ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండ పెట్టువాడా కీర్తనలు 113:7
604 దరిద్రులకు న్యాయము తీర్చువాడా  కీర్తనలు 140:12
605 తండ్రిలేని వారికి తండ్రియగు దేవా కీర్తనలు 68:5
606 వెధవరాండ్రకు న్యాయకర్తయైన దేవా కీర్తనలు 68:5
607 తండ్రిలేని వారికి సహాయకుడైయున్న దేవా కీర్తనలు 10:14
608 దిక్కులేని దరిద్రుల ప్రార్ధనను నిరాకరింపని దేవా కీర్తనలు 102:17
609 తండ్రిలేని వారిని వెధవరాండ్రను ఆధరించు దేవా కీర్తనలు 146:9
610 పరదేశులను కాపాడు దేవా కీర్తనలు 146:9
611 పరదేశియందు దయయుంచి అన్నవస్త్రములను అనుగ్రహించు దేవా ద్వితీయో 10:18
612 బందింపబడిన వారిని విడిపించిన వారిని వర్ధిల్లజేయు దేవా కీర్తనలు 68:6
613 నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేయు దేవా కీర్తనలు 68:10
614 తన సేవకులను బట్టి సంతాపము నొందు దేవా కీర్తనలు 135:14
615 సేవకుల క్షేమమును చూచి ఆనందించుదేవా కీర్తనలు 35:27
616 సేవకుల మాట రూఢి పరచు దేవా యెషయ 44:26
617 నాదూతల ఆలోచన నెరవేర్చు వాడా యెషయ 44:26
618 తన పరిచారకులను అగ్నిజ్వాలలనుగా చేయువాడా కీర్తనలు 104:4
619 తన సేవకుల ప్రాణమును విమోచించు దేవా కీర్తనలు 34:22
620 తన సేవకులను బట్టి ప్రతిదండన చేయు దేవా ద్వితీయో  32:43
621 నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయు దేవా కీర్తనలు 31:16
622 ఒకని నడతను స్థిరపరచు యెహోవా మీకు కీర్తనలు 37:23
623 నీతిమంతుడగు వాడు పడినను తన చేయితో పట్టుకొని యెహోవా కీర్తనలు 37:24
624 యధార్ధ హృదయులను రక్షించు దేవా కీర్తనలు 7:10
625 హృదయములను పరిశీలన చేయు దేవా సామెతలు 21:2
626 హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా కీర్తనలు 7:9
627 నీతిమంతులను పరిశీలించు దేవా కీర్తనలు 11:5
628 నీతిమంతుల సంతానము పక్షమునున్న దేవా కీర్తనలు 14:5
629 నీతిమంతులను శ్రమలన్నింటిలో నుండి విడిపించు దేవా కీర్తనలు 34:17
630 నీతిమంతులకు కలుగు ఆపదలలో నుండి విడిపించు దేవా కీర్తనలు 34:19
631 నీతిమంతుని ఎముకలన్నిటిని కాపాడు దేవా కీర్తనలు 34:20
632 నీతిమంతుడు విడువబడుటగాని, వారి సంతానము భిక్షామెత్తుట లేదు దేవా కీర్తనలు 37:25
633 నీతిమంతులను సంరక్షుడగు దేవా కీర్తనలు 37:17
634 నీతిమంతులను, కేడెముతో కప్పియున్న దేవా కీర్తనలు 5:12
635 నీతిమంతుల సహాయకుడైన రక్షించు దేవా కీర్తనలు 37:40
636 నీతిమంతుని ఎన్నడును కదలనీయని దేవా కీర్తనలు 55:22
637 నీతిమంతుని ఖర్జూరపు వృక్షమువలె చేయు దేవా కీర్తనలు 92:12
638 నీతిమంతులను ప్రేమించు యెహోవా కీర్తనలు 146:8
639 నీతిమంతులు ముసలితనమందు చిగురు పెట్టెదరు సారము కలిగి పచ్చగానుందురు అని చెప్పిన దేవా కీర్తనలు 92:15
640 యధార్ధ వంతులను తోడైయున్న దేవా II  దినవృత్తాంత 19:11
641 నిర్ధోషుల చర్యలను గుర్తించు యున్న దేవా కీర్తనలు 37:18
642 యధార్ధముగా ప్రవర్తించు వారికి మేలు చేయు దేవా కీర్తనలు 84:11
643 దీనులను లేవనెత్తు దేవా కీర్తనలు 147:6
644 దీనులను రక్షణతో అలంకరించు దేవా కీర్తనలు 149:4
645 దీనులకు మార్గమును నేర్పుచున్న దేవా కీర్తనలు 25:9
646 దీనులకు మార్గమును ఉపదేశించు దేవా కీర్తనలు 25:8
647 మీ యందు భయ భక్తులు గల వారికి మర్మములను తెలుపుచున్న దేవా కీర్తనలు 25:14
648 వేయి తరముల వరకు నిబంధనను స్థిరపరచువాడై కృప చూపు నమ్మతగిన దేవా ద్వితీయో  7:9
649 న్యాయము చేయు వాని విడువని దేవా కీర్తనలు 37:28
650 తమ భక్తులతో శుభ వచనములు సెలవిచ్చు దేవా కీర్తనలు 85:8
651 తమ భక్తుల ప్రవర్తనను కాచు దేవా సామెతలు 2:8
652 తమ భక్తుల పాదములను తోట్రిల్లకుండా కాపాడు దేవా I సముయేలు 2:9
653 పరిశుద్ధ దూతల సభలో మిక్కిలి భీకరుడవైన దేవా కీర్తనలు 89:7
654 తమ చుట్టునున్న వారందరి కంటే భయంకరుడవైన దేవా కీర్తనలు 89:7
655 కేరుబులు, సెరాపులు నిత్యము గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయు చూన్నందుకు మీకు  యెషయ 6:3
656 నా తల ఎత్తు వాడవుగా నున్న దేవా కీర్తనలు 3:3
657 గురుపోతు కొమ్ముల వలె నీవు నా కొమ్మును ఎత్తియున్న దేవా కీర్తనలు 92:10
658 ఎత్తైన స్థలములలో నను నిలుపుచున్న దేవా కీర్తనలు 18:33
659 నాకు ఆధారమైయున్న దేవా కీర్తనలు 3:5
660 నన్ను సురక్షితముగా నివసింపజేయు దేవా కీర్తనలు 4:8
661 నన్ను ఆదుకొను దేవా, ఆదరించు దేవా కీర్తనలు 18:18
662 నా దీపమును వెలిగించు దేవా నా చీకటిని వెలుగుగా చేయు దేవా కీర్తనలు 18:28
663 నాకు చెవులు నిర్మించియున్న దేవా కీర్తనలు 40:6
664 నా విజ్ఞాపన ధ్వనిని ఆలకించిన దేవా కీర్తనలు 28:6
665 నా రోదనా ధ్వని విన్న దేవా కీర్తనలు 6:8
666 నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచిన దేవా కీర్తనలు 56:8
667 నా కన్నీళ్ళు విడువకుండా నా కన్నులను తప్పించియున్న దేవా కీర్తనలు 116:8
668 జారీ పడకుండ నా పాదము తప్పించితివే దేవా కీర్తనలు 116:8
669 నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిరపరచిన దేవా కీర్తనలు 40:2
670 నా పాదములను వలలో నుండి విడిపించిన దేవా కీర్తనలు 25:15
671 నా కాళ్ళు చిక్కు పడకుండునట్లు కాపాడిన దేవా కీర్తనలు 3:26
672 నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయు దేవా కీర్తనలు 18:33
673 నా చీల మండలు వణకక నా పాదము విశాల పరచితివే దేవా కీర్తనలు 18:36
674 నా మార్గము యధార్ధ పరచిన దేవా కీర్తనలు 18:32
675 నా సకల మార్గమునకు అధిపతియైన దేవా దానియేలు 5:23
676 విశాల స్థలమునకు నన్ను తోడుకొని వచ్చిన దేవా కీర్తనలు 18:19
677 నా శత్రువుల చేత నన్ను చెరపట్టనీయక, విశాల స్థలమున నా పాదములు నిలువపెట్టిన దేవా కీర్తనలు 31:81
678 ఇరుకునందుండి నన్ను విశాల స్థలమునకు తీసుకొని వచ్చిన దేవా కీర్తనలు 118:5
679 ఆపదలన్నింటిలో నుండి నన్ను విడిపించిన దేవా కీర్తనలు 54:7
680 బలాత్కారుల నుండి నన్ను విడిపించిన దేవా II సముయేలు 22:2
681 ఆరు బాధలలో నుండి నన్ను విడిపించి ఏడు బాధలు కలిగినను నాకు ఏ కీడును తగలదు దేవా యోబు 5:19
682 కోట గల గొప్ప పట్టణములో నన్ను నడిపించు వాడా కీర్తనలు 60:9
683 నా చేతులకు యుద్ధము నేర్పిన దేవా కీర్తనలు 18:34
684 నా చేతులు యుద్ధమును,  నా వ్రేళ్లను పోరాటమును నేర్పిన దేవా మీకు కీర్తనలు 144:1
685 నా చెయ్యి పట్టుకొని నాకు నడక నేర్పిన దేవా హోషేయ 11:3
686 దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుని తప్పించిన దేవా కీర్తనలు 144:10
687 యుద్ధమున ఖడ్గము బలము నుండి తప్పించు దేవా యోబు 5:20
688 యుద్ధ దినమున నా తలను కాచియున్న దేవా కీర్తనలు 140:7
689 యుద్ధములో నీవు నన్ను బలము ధరింపజేసి నా మీద లేచిన వారిని నా క్రింద అణచిన దేవా కీర్తనలు 18:39
690 నా మీద లేచినవారు పలుకు మాటలను దినమెల్లవారు నా మీద చేయు ఆలోచనయు నీవు వినియున్నావు విలాప 3:62
691 యెహోవా నాకు కలిగిన అన్యాయమును చూచియున్నావు విలాప 3:59
692 నాకు బలము ధరింపజేయుచున్న దేవా కీర్తనలు 18:32
693 నాకు బలమును నీయమించిన దేవా కీర్తనలు 68:28
694 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించితిని అందువలన విడువక కృప చూపుచున్నాను అని చెప్పిన దేవా యిర్మియ 31:3
695 నేను నిన్ను ఎరుగకుండి నప్పటికి నీవు నాకు బిరుదులిచ్ఛితివి యెషయ 45:4
696 నీ సాత్వికము నన్ను గొప్పచేసెను కీర్తనలు 18:35
697 అన్యజనులకు అధికారిగా చేసితివి దేవా కీర్తనలు 18:43
698 జనములను నాకు లోపరచిన వాడు ఆయనే కీర్తనలు 18:47
699 జనములను నాకు వశపరచు దేవా కీర్తనలు 47:3
700 మన పాదముల క్రింద ప్రజలను అణగ త్రొక్కునట్లు చేసిన దేవా కీర్తనలు 47:3


Previous 501 – 600


Next 701 – 800

Scroll to Top