“Let everything that has breath praise the LORD. Praise the LORD.” (Psalm 150:6
Praise is indeed important in the Bible, and there are numerous verses that highlight its significance. Praise is a way to express gratitude, honour, and reverence to God. It acknowledges His greatness, faithfulness, and power.
1000 Praises 901 – 1000
901 | మీ సంవత్సరముల సంఖ్య మితి లేనిది ప్రభువా | యోబు 36:26 |
902 | సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేయుచున్నావు ప్రభువా | కీర్తనలు 65:11 |
903 | నీ జాడలు సారము వెదజల్లుచున్నవి | కీర్తనలు 65:11 |
904 | నీ యొద్ద జీవ జలపు ఊట కలదు ప్రభువా | కీర్తనలు 36:9 |
905 | నీ న్యాయవిధులు మహా గాధములు ప్రభువా | కీర్తనలు 36:6 |
906 | నీ ఆలోచనలు అతిగంభీరములు ప్రభువా | కీర్తనలు 92:5 |
907 | ఆహా దేవుని బుద్ధి జ్ఞానములు బాహుళ్యము ఎంతో గంభీరము ప్రభువా | రోమా 11:33 |
908 | నీ మహత్యము గ్రహింప శఖ్యము కాదు ప్రభువా | కీర్తనలు 145:3 |
909 | ఎవడును తెలిసికొనలేని మహతైన కార్యములను, లెక్క లేనన్ని అధ్బుత క్రియలను చేయు దేవా | యోబు 9:10 |
910 | విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు | యోబు 34:24 |
911 | నీ జ్ఞానము శోదించుటకు అసాధ్యము ప్రభువా | యెషయ 34:24 |
912 | నీ మార్గములు అగన్యములు ప్రభువా | రోమా 11:33 |
913 | యెహోవా నీ కార్యములు ఎంతో దొడ్డవి ప్రభువా | కీర్తనలు 92:5 |
914 | నీ చర్యలన్నియు న్యాయములు, అవి యధార్ధమైనవి ప్రభువా | ద్వితియో 32:4 |
915 | మీ నీతి పర్వతములకు సమానము | కీర్తనలు 36:6 |
916 | భూమ్యాకాశములకు పైగా యున్న నీ ప్రభావము కొరకై | కీర్తనలు 148:13 |
917 | నీ కృప ఆకాసమును అంటుచున్నది | కీర్తనలు 36:5 |
918 | నీ సత్య సంధత్వము అంతరిక్షమును అంటుచున్నది దేవా | కీర్తనలు 36:5 |
919 | నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించదరు | కీర్తనలు 36:7 |
920 | దేవుని రధములు సహస్రములు సహస్ర సహస్రములు | కీర్తనలు 68:17 |
921 | మేఘములను తనకు వాహనముగా చేసికొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు | కీర్తనలు 104:3 |
922 | అరణ్యములో వాహనమెక్కి ప్రయాణము చేయు దేవా | కీర్తనలు 68:4 |
923 | తెరను పరచునట్లు ఆకాశవిశాలమును నీవు పరచి యున్నావు | కీర్తనలు 104:3 |
924 | నక్షత్రముల సంఖ్య నీయమించి యున్నావు | కీర్తనలు 147:4 |
925 | నక్షత్రములను మరగు పరచుచున్న దేవా | యోబు 9:7 |
926 | భక్తులను శోధన లో నుండి తప్పించు దేవా మీకు | II పేతురు 2:9 |
927 | శిక్ష లో యున్నవారిని తీర్పు తీర్చు దినము వరకు కావలి లో ఉంచుటకు సమర్డుడా | II పేతురు 2:9 |
928 | మా హృదయము కంటె అధికుడై సమస్తమును ఎరిగి యున్న దేవా | I యోహాను 3:20 |
929 | యోనా కంటే గొప్పవాడా | మత్తయి 12:41 |
930 | సొలోమోను కంటే గొప్పవాడా | మత్తయి 12:42 |
931 | అందరి కంటే గొప్ప వాడా | యోహాను 10:29 |
932 | దేవాలయము కంటే గొప్ప వాడా | మత్తయి 12:6 |
933 | సీయోను లో యెహోవా మహోన్నతుడు | కీర్తనలు 99:2 |
934 | మాలోయున్న వాడు లోకములో ఉన్న వాని కంటే గొప్పవాడు | I యోహాను 4:4 |
935 | మీ జ్ఞానము మితిలేదు | కీర్తనలు 147:5 |
936 | మీ దయ ఎంతో గొప్పది గా ఉన్నందుకు | జకర్య 9:17 |
937 | మీ సౌoదర్యము ఎంతో గొప్పదిగా ఉన్నందుకు | జకర్య 9:17 |
938 | నీవు ఎంతైనా నమ్మతగిన వాడవు ప్రభువా | విలాప 3:23 |
939 | యెహోవా మహాకృప గల వాడి యున్నాడు | I దిన 21:13 |
940 | మీ యొక్క ప్రభావము మహా గొప్పది గా ఉన్నందుకు | కీర్తనలు 138:5 |
941 | నీవు చూపిన కృప అధికమై యున్నది | కీర్తనలు 86:13 |
942 | పగటి వేళ తన కృపను కలుగ నాజ్ఞాపించుచున్నాడు | కీర్తనలు 42:8 |
943 | నీ కృప జీవము కంటే ఉత్తమము ప్రభువా | కీర్తనలు 63:3 |
944 | కృపను ఘనతయును అనుగ్రహించు దేవా | కీర్తనలు 63:3 |
945 | దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది | కీర్తనలు 36:7 |
946 | దేవా నీ కృప నిత్యముండును | కీర్తనలు 106:1 |
947 | మేము నిర్మూలము కాకున్నది మీ కృపయే దేవా | విలాప 3:22 |
948 | అనుదినము నూతనము గా అయన వాత్సల్యత పుట్టుచున్నది | విలాప 3:23 |
949 | కరుణా, కటాక్షములను కిరీటముగా ఉంచియున్నావు దేవా | కీర్తనలు 103:4 |
950 | అంతము లేని మీ కృప కొరకు | విలాప 3:22 |
951 | నీవు చేసిన ఉపకారములన్నింటి కొరకు | కీర్తనలు 103:2 |
952 | ప్రభువా నీవు మహత్యమును ప్రభావమును ధరించియున్నావు | కీర్తనలు 104:1 |
953 | యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొనియున్నాడు | కీర్తనలు 93:1 |
954 | వస్త్రము వలె వెలుగును నీవు కట్టుకొని యున్నావు దేవా | కీర్తనలు 104:2 |
955 | నీతిని కవచముగా ధరించి యున్నదేవా | యెషయ 59:17 |
956 | రక్షణను శిరస్త్రానముగా ధరించుకొనెను | యెషయ 59:17 |
957 | ప్రతిదండనను వస్త్రముగా వేసికోనిన దేవా | యెషయ 59:18 |
958 | ఆసక్తిని పై వస్థ్రముగా ధరించుకోనినవాడా | యెషయ 59:18 |
959 | రెండంచులు ఖడ్గము గలవాడా | ప్రకటన 2:12 |
960 | వాయువులను తనకు దూతలుగా చేసికొన్న దేవా | కీర్తనలు 104:4 |
961 | ఆశగల ప్రాణమును తృప్తి పరచియున్నాడు | కీర్తనలు 107:9 |
962 | ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి యున్నాడు | కీర్తనలు 107:9 |
963 | తన వాక్కు పంపి బాగుచేయు దేవా | కీర్తనలు 107:20 |
964 | నా బాధలో నీ వాక్యము నెమ్మది కలిగించిన దేవా | కీర్తనలు 119:50 |
965 | నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులున్నందుకై | కీర్తనలు 119:18 |
966 | నీ మాట వలన నిరీక్షన పుట్టించితివే | కీర్తనలు 119:49 |
967 | నీ వాక్యము నన్ను బ్రతికించెను దేవా | కీర్తనలు 119:50 |
968 | యెహోవా నీ మాట చొప్పున మేలుచేసితివి, చేయుదువు, చేయుచున్నావు | కీర్తనలు 119:65 |
969 | నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది | కీర్తనలు 119:105 |
970 | నీ వాక్యము తెలివిలేని వారికి తెలివి కలిగించును | కీర్తనలు 119:130 |
971 | నీ మాట మిక్కిలి స్వచ్చమైనది | కీర్తనలు 119:140 |
972 | నీ మాట సంతోషమును ఆనందమును కలుగజేయుచున్నందుకు | యిర్మియా 15:16 |
973 | యధార్ధముగా ప్రవర్తించు వారికి నీ మాటలు క్షేమ సాధనములు | మీకా 2:7 |
974 | నీ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై యున్నందుకు | II తిమోతి 4:9 |
975 | నీ వాక్యము సజీవమై బలముగలదై యున్నందుకు | హెబ్రీ 4:12 |
976 | నీ మాట అగ్ని వంటిది బండలు బద్దలు చేయు సుత్తె వంటిది | యిర్మియా 23:29 |
977 | నీ నోటి మాట అగ్ని గాను చేసి యున్నావు | యిర్మియా 5:14 |
978 | యెహోవా వాక్యము యదార్ధమైనది ఆయన చేయునది అంతయు నమ్మకమైనదియై యున్నది | కీర్తనలు 33:4 |
979 | నీ ధర్మోపదేశము అపరిమితమైనది | కీర్తనలు 119:96 |
980 | నీతిని బట్టి భీకర క్రియలను చేయ మాకు ఉత్తరమిచుచున్నావు,యిచ్చియున్నావు,యివ్వబోవుచున్నావు | కీర్తనలు 65:5 |
981 | నీతిని బట్టి ఉత్తరమిచ్చుచున్నావు | కీర్తనలు 65:5 |
982 | మీ కోపము నిమిషమాత్రము మీ దయ ఆయుష్కాలమంతయు నిలిచి యుండును | కీర్తనలు 30:5 |
983 | ఎల్లపుడు వ్యాజ్యమాడు వాడు కాదు ఆయన నిత్యమును కోపించు వాడు కాడు | కీర్తనలు 103:9 |
984 | నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరకును గనుక మీకు | కీర్తనలు 130:4 |
985 | నీ యొద్ద సంపూర్ణ విమోచన దొరకును గనుక మీకు | కీర్తనలు 130:4 |
986 | నీ రక్షణ నిమితము నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా | కీర్తనలు 42:5 |
987 | ఆకాశం విశాలము సృజించిన వాడవు నీవే గనుక | కీర్తనలు 96:5 |
988 | ప్రపంచములను నిర్మించిన వాడవు నీవే కనుక | హెబ్రీ 1:2 |
989 | భూమ్యాకాశములను సృజించినవాడా మీకు | **** |
990 | వెలుగును కలుగ జేసినా వాడా మీకు | **** |
991 | ఆకశ విశాలమును సముద్రములో ఉప్పును కలుగజేసిన వాడా మీకు | **** |
992 | పుష్పములు, ఫలములు,దినుసులు,కాయలు,ఆకుకూరలు వీటి కొరకు వీటి నిచ్చు చెట్లు, వ్రుక్షములు, తీగెలు కొరకు | **** |
993 | సూర్యుడు, చంద్రుడు, నక్షత్రముల కొరకు | **** |
994 | జల చరములు, మృగములు, పక్షులు,చేపల కొరకు | **** |
995 | పక్షులు, ఊరు ప్రాణులు, జంతువులు, అడవి మృగముల కొరకు | **** |
996 | మట్టితో మనుష్యుని సృజించి వాని నాసికా రంద్రములో జీవపు వాయువును ఊది తగిన జత నిర్మించిన వాడా | **** |
997 | నీవు నిర్ణయించిన కాలము కొరకు, వర్షము కొరకు ఎండ కొరకు, గాలి కొరకు ఉత్తర వాయువు కొరకు | **** |
998 | నదుల కొరకు, వాగుల కొరకు, చెరువుల కొరకు కోనేటి కొరకు మీకు | **** |
999 | కొండల కొరకు, మెట్టల కొరకు, లోయల కొరకు, గుట్టల కొరకు, మైదానము కొరకు, బీట భూముల కొరకు, శీతోష్ణప్రదేశముల కొరకును ప్రభువా | **** |
1000 | అడవుల కొరకు, గుహల కొరకు, నీటి మడుగుల కొరకు, జల ఊటల కొరకు, ఉప్పొంగు జల ఊటలకోరకు, మందు వాయువు ఈ ప్రకృతి అన్నింటిని కృపతో నింపి నందులకై యెహోవా నామమునకే | **** |