jesus miracle

“Let everything that has breath praise the LORD. Praise the LORD.” (Psalm 150:6

Praise is indeed important in the Bible, and there are numerous verses that highlight its significance. Praise is a way to express gratitude, honour, and reverence to God. It acknowledges His greatness, faithfulness, and power.

1000 Praises  801 – 900

 

801 నా రాకపోకల యందు యెహోవా నన్ను కాపాడును కీర్తనలు 121:8
802 నా చర్యలన్నింటిని నీవు బాగుగా తెలుసుకొని యున్నావు కీర్తనలు 139:3
803 నాకు ముందుగా దహించు అగ్ని వలే దాటి పోవుచున్న దేవా ద్వితీయో 9:3
804 ఆయన నాకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును  ద్వితీయో  33:26
805 యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని యున్నావు  కీర్తనలు 139:1
806 నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలిసి యున్నందుకు  కీర్తనలు 139:2
807 నా తలంపులు పుట్టక  మునుపే నీవు నా మనసును గ్రహించుచున్నందుకు  కీర్తనలు 139:2
808 శిష్యునకు తగిన నోరు నీవు నాకు దయ చేసి యున్నావు  యెషయ 50:4
809 యెహోవా, మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసే యున్నందుకు  కీర్తనలు 139:4
810 నా నడకను, నా పడకను నీవు పరిశీలనా చేసి యున్నావు  కీర్తనలు 139:3
811 నేను ఆపదలో చిక్కు బడినప్పుడు నీవు నన్ను బ్రతికించితివి కీర్తనలు 138:7
812 నాలో నా ప్రాణము క్రుంగి యున్నప్పుడు నా మార్గము నాకు తెలిపితివి కీర్తనలు 142:3
813 వెనుకకు, ముందుకు నీవు నన్ను ఆవరించి యున్నందుకు  కీర్తనలు 139:5
814 ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నన్ను శిక్షించుచున్న యెహోవా  ద్వితియో 8:5
815 యెహోవా నన్ను కఠినము గా శిక్షించను గాని నన్ను మరణమునకు అప్పగించలేదు  కీర్తనలు 118:18
816 విరోదుల పండ్లకు వేటగా అప్పగించని యెహోవా కీర్తనలు 124:6
817 నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి  కీర్తనలు 138:3
818 నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి భయపడకుమని చెప్పినందుకు  విలాపవాక్యము 3:57
819 దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటికై కీర్తనలు 139:17
820  నా గుమ్మముల గడియలను బలపరచి యున్నాడు నా మధ్యనున్న పిల్లలను ఆశీర్వదించి యున్నావు కీర్తనలు 147:13
821 నా సరిహద్దులలో సమాధానము కలుగజేయు చున్నావు  కీర్తనలు 147:17
822 నన్ను విడిపించుటకు నా శత్రువులను నాకు అప్పగించుటకు నా పాళెములో సంచరించుచున్నందుకు ద్వితియో 23:14
823 అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి కొండ తేనెతో నన్ను తృప్తి పరచుచున్నందుకు  కీర్తనలు 81:16
824 మనోబీష్టము వాలే సఫలము చేయుచున్నావు కీర్తనలు 21:2
825 మన దీన దశ లో నున్నప్పుడు మమ్ములను జ్ఞాపకము చేసికొన్న దేవా కీర్తనలు 136:23
826 మమ్మును  మరచిపోలేని దేవా  కీర్తనలు 115:12
827 మమ్మును  లేపి చక్కగా నిలువ బెట్టిన దేవా కీర్తనలు 20:8
828 మమ్మును నిలువు గా నడువ చేసిన దేవా లేవి 26:13
829 ఇంతకు ముందు వెళ్ళని త్రోవ నేను రక్షితముగా దాటిపోవునట్లు చేయుచున్న దేవా  యెషయ 41:3
830 నీ సన్నిధిని సంతోషమును మమ్మును ఉల్లాశింపజేయుచున్నావు కీర్తనలు 21:6
831 నీ ఆనంద ప్రవాహములో నీవు నన్ను త్రాగించుచున్నావు కీర్తనలు 36:8
832 ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించుచున్నావు కీర్తనలు 57:3
833 మా శత్రువులను అనుగ త్రొక్కుచున్నావు కీర్తనలు 108:13
834 మా శత్రువుల చేతిలో నుండి మమ్మును రక్షించి మమ్మును ద్వేషించువారిని సిగ్గుపరచు వాడవు నీవే కీర్తనలు 44:7
835 వెండిని నిర్మలము చేయు రీతి మమ్మును నిర్మలము చేయుచున్నావు కీర్తనలు 66:10
836 మా కాడి పలుపులను తెంపు దేవా లేవి 26:13
837 తన యందు భయ భక్తులు కలిగిన పిన్నలనేమి పెద్ధలనేమి ఆశీర్వదించు  దేవా కీర్తనలు 115:13
838 ఇశ్రాయేలియులను ఆశీర్వదించు దేవా కీర్తనలు 115:12
839 అహరోను వంశస్తులను ఆశీర్వదించు దేవా కీర్తనలు 115:12
840 భూమ్యాకాశములను సృజించిన యెహోవా చేత మేము ఆశీర్వదింపబడితిమి కీర్తనలు 115:15
841 యెహోవా మమ్మును మా పిల్లలను వృద్ది పొందించుచున్నందుకు కీర్తనలు 115:14
842 నీ సేవకుని కుమారులు నిలిచియుందురు కీర్తనలు 102:28
843 నీ సేవకుని సంతతి నీ సన్నిధిలో స్థిరపరచబడును కీర్తనలు 102:28
844 నీ యందు భయ భక్తులు కలవారికి నీ కృప యుగ యుగములు నిలుచును కీర్తనలు 103:17
845 భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగానున్నదో ఆయన యందు భయభక్తులుగల వారికి ఆయన కృప అంత అధికముగానుండును కీర్తనలు 103:11
846 తండ్రి తన కుమారుల యెడల జాలి పడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును కీర్తనలు 103:13
847 మా పాపముల బట్టి మాకు ప్రతిఫలమియ్యక మా దోషములను బట్టి మాకు ప్రతిఫలమియ్యకయున్నందుకై కీర్తనలు 103:10
848 పడమటికి తూర్పు యెంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి యున్నందుకు కీర్తనలు 103:12
849 నిజముగా నీవు మా పక్షమునుండి మా పనులన్నింటిని సఫలపరచుచున్నందుకు యెషయ 30:26
850 తన ప్రజలకు బల పరాక్రమమును అనుగ్రహించుచున్నందుకు కీర్తనలు 149:4
851 తన ప్రజలకు సమాధానమును కలుగజేసి ఆశీర్వదించుచున్నందులకు కీర్తనలు 148:14
852 యెహోవా తన ప్రజల గాయము కత్తి వారి దెబ్బలు బాగుచేయు దేవా యెషయ 30:26
853 యెహోవా తన ప్రజలయందు ప్రీతిగల దేవా కీర్తనలు 149:4
854 తన ప్రజలకు ఒక శృంగామును హెచ్చించినందుకై కీర్తనలు 148:14
855 యెహోవా తన మందను దర్శించి వారిని అశ్వముల వంటి వారీగా చేయుచున్నావు జకర్య 10:3
856 తన ప్రజలను మంద వలె నడిపించుచున్న దేవా కీర్తనలు 77:20
857 యెహోవా స్వరము బలమైనది కీర్తనలు 29:4
858 యహోవా స్వరము ప్రభావము గలది కీర్తనలు 29:4
859 యహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును కీర్తనలు 29:20
860 యెహోవా స్వరము అరణ్యమును కదిలించును కీర్తనలు 29:7
861 యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది కీర్తనలు 29:8
862 యెహోవా స్వరము లేళ్ళను ఈనచేయును కీర్తనలు 29:9
863 నీ దక్షిణ హస్తము, నీ బాహువు, నీ ముఖ కాంతి మాకు విజయమును కలుగజేయును కీర్తనలు 44:3
864 యెహోవా కను దృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నందుకు II దిన 16:19
865 నీ ముఖకాంతికై కీర్తనలు 44:3
866 దుష్టమృగములుండు పర్వతము సౌదార్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు అందుకై  కీర్తనలు 76:4
867 భూమ్యాకాశముల అంతట నున్న వాడవు యిర్మియా 23:24
868 సమస్తమును పూర్తిగా నింపుచున్న సంపూర్ణతయైయున్న దేవా ఎఫెసి 1:23
869 అలసియున్న వారి ఆశను తృప్తి పరచెదువు, కృశించిన వారినందరిని నింపుచున్న దేవా యిర్మియా 31:24
870 తన అభిశక్తునకు రక్షణ దుర్గమునై యున్న దేవా కీర్తనలు 28:8
871 తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగచేయు దేవా I సముయేలు 2:10
872 యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతికారము చేయును కీర్తనలు 31:23
873 హృదములనుఏకరీతిగా నిర్మించిన దేవా కీర్తనలు 33:15
874 మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించిన దేవా మీకు జకర్య 12:1
875 మనుష్యుల యోచనాలు వారికి తెలియచేయు వాడు ఆయనే అందుకొరకు అమోసు 4:13
876 మనుషులందరికి వారి వారి క్రియలను బట్టి ప్రతిఫలమిచ్చుచున్న దేవా కీర్తనలు 62:12
877 యెహోవా యందు భయభక్తులు గలవారి  చుట్టూ ఆయన్ దూత కావాలియుండి వారిని రక్షించు దేవా కీర్తనలు 34:7
878 నీ నామము నందు భయభక్తులు గల వారి స్వాస్త్యము నీవు నాకు అనుగ్రహించియున్నందులకై కీర్తనలు 61:5
879 విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు – నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును కీర్తనలు 34:18
880 నీవే కార్యము నెరవేర్చు వాడవు కీర్తనలు 37:5
881 బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను కీర్తనలు 62:11
882 ప్రార్ధన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు కాబట్టి కీర్తనలు 65:2
883 నీకు ఆసాద్యమైనది ఏదియు లేదు యిర్మియా 32:27
884 దేని కాలమందు అధి చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నీయమించియున్నాడు ప్రసంగి 3:11
885 ఆయన చెప్పిన యే మాటాయు నిరర్ధకము కాలేదు లూకా 1:37
886 నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము  మార్కు 14:36
887 ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను ఆయన ఆజ్ఞ పంపగానే కార్యము స్థిరపరచబడెను కీర్తనలు 33:9
888 ప్రతి మోకాలును,  నీ యెదుట వంగును. ప్రతి నాలుకాయు దేవుని స్తుతించును రోమా 14:11
889 నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది కీర్తనలు 104:13
890 నీవు కలుగ చేసిన వాటితో భూమి నిండియున్నది కీర్తనలు 104:24
891 నీవు భూతలమును నూతన పరచుచున్నావు కీర్తనలు 104:30
892 దేవా భూమిని దర్శించి తడుపుచున్నావు  కీర్తనలు 65:9
893 దేవుని నది నీళ్ళతో నిండియున్నది కీర్తనలు 65:9
894 భూమి మొలకెత్తగా నీవి దాని నాశీర్వదించుచున్నావు కీర్తనలు 65:10
895 భూమిని యెహోవా కృపతో నింపియున్నాడు కీర్తనలు 33:5
896 భూమికి దాని సరిహద్దులను నీయమించిన వాడవు నీవే కీర్తనలు 74:17
897 భూదిగంతులను సృజించిన దేవా యెషయ 40:28
898 ఆకాశమందు తన కొరకై మేడగదులను కట్టుకొని, భూమి యందు పునాదులను వేయు వాడవు నీవే అమోసు 9:6
899 భూలోకమును కదలకుండా స్థిరపరచుచున్నావు  I దిన 16:30
900 మహోన్నతుని దక్షిణ హస్తము మార్పునోంనొందెననుటకు నాకు కలిగిన శ్రమయే కారణము  కీర్తనలు 77:10


Previous 701 – 800


Next 901 – 1000

Scroll to Top