“Let everything that has breath praise the LORD. Praise the LORD.” (Psalm 150:6
Praise is indeed important in the Bible, and there are numerous verses that highlight its significance. Praise is a way to express gratitude, honour, and reverence to God. It acknowledges His greatness, faithfulness, and power.
1000 Praises 801 – 900
| 801 | నా రాకపోకల యందు యెహోవా నన్ను కాపాడును | కీర్తనలు 121:8 |
| 802 | నా చర్యలన్నింటిని నీవు బాగుగా తెలుసుకొని యున్నావు | కీర్తనలు 139:3 |
| 803 | నాకు ముందుగా దహించు అగ్ని వలే దాటి పోవుచున్న దేవా | ద్వితీయో 9:3 |
| 804 | ఆయన నాకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును | ద్వితీయో 33:26 |
| 805 | యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని యున్నావు | కీర్తనలు 139:1 |
| 806 | నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలిసి యున్నందుకు | కీర్తనలు 139:2 |
| 807 | నా తలంపులు పుట్టక మునుపే నీవు నా మనసును గ్రహించుచున్నందుకు | కీర్తనలు 139:2 |
| 808 | శిష్యునకు తగిన నోరు నీవు నాకు దయ చేసి యున్నావు | యెషయ 50:4 |
| 809 | యెహోవా, మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసే యున్నందుకు | కీర్తనలు 139:4 |
| 810 | నా నడకను, నా పడకను నీవు పరిశీలనా చేసి యున్నావు | కీర్తనలు 139:3 |
| 811 | నేను ఆపదలో చిక్కు బడినప్పుడు నీవు నన్ను బ్రతికించితివి | కీర్తనలు 138:7 |
| 812 | నాలో నా ప్రాణము క్రుంగి యున్నప్పుడు నా మార్గము నాకు తెలిపితివి | కీర్తనలు 142:3 |
| 813 | వెనుకకు, ముందుకు నీవు నన్ను ఆవరించి యున్నందుకు | కీర్తనలు 139:5 |
| 814 | ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నన్ను శిక్షించుచున్న యెహోవా | ద్వితియో 8:5 |
| 815 | యెహోవా నన్ను కఠినము గా శిక్షించను గాని నన్ను మరణమునకు అప్పగించలేదు | కీర్తనలు 118:18 |
| 816 | విరోదుల పండ్లకు వేటగా అప్పగించని యెహోవా | కీర్తనలు 124:6 |
| 817 | నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి | కీర్తనలు 138:3 |
| 818 | నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి భయపడకుమని చెప్పినందుకు | విలాపవాక్యము 3:57 |
| 819 | దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటికై | కీర్తనలు 139:17 |
| 820 | నా గుమ్మముల గడియలను బలపరచి యున్నాడు నా మధ్యనున్న పిల్లలను ఆశీర్వదించి యున్నావు | కీర్తనలు 147:13 |
| 821 | నా సరిహద్దులలో సమాధానము కలుగజేయు చున్నావు | కీర్తనలు 147:17 |
| 822 | నన్ను విడిపించుటకు నా శత్రువులను నాకు అప్పగించుటకు నా పాళెములో సంచరించుచున్నందుకు | ద్వితియో 23:14 |
| 823 | అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి కొండ తేనెతో నన్ను తృప్తి పరచుచున్నందుకు | కీర్తనలు 81:16 |
| 824 | మనోబీష్టము వాలే సఫలము చేయుచున్నావు | కీర్తనలు 21:2 |
| 825 | మన దీన దశ లో నున్నప్పుడు మమ్ములను జ్ఞాపకము చేసికొన్న దేవా | కీర్తనలు 136:23 |
| 826 | మమ్మును మరచిపోలేని దేవా | కీర్తనలు 115:12 |
| 827 | మమ్మును లేపి చక్కగా నిలువ బెట్టిన దేవా | కీర్తనలు 20:8 |
| 828 | మమ్మును నిలువు గా నడువ చేసిన దేవా | లేవి 26:13 |
| 829 | ఇంతకు ముందు వెళ్ళని త్రోవ నేను రక్షితముగా దాటిపోవునట్లు చేయుచున్న దేవా | యెషయ 41:3 |
| 830 | నీ సన్నిధిని సంతోషమును మమ్మును ఉల్లాశింపజేయుచున్నావు | కీర్తనలు 21:6 |
| 831 | నీ ఆనంద ప్రవాహములో నీవు నన్ను త్రాగించుచున్నావు | కీర్తనలు 36:8 |
| 832 | ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించుచున్నావు | కీర్తనలు 57:3 |
| 833 | మా శత్రువులను అనుగ త్రొక్కుచున్నావు | కీర్తనలు 108:13 |
| 834 | మా శత్రువుల చేతిలో నుండి మమ్మును రక్షించి మమ్మును ద్వేషించువారిని సిగ్గుపరచు వాడవు నీవే | కీర్తనలు 44:7 |
| 835 | వెండిని నిర్మలము చేయు రీతి మమ్మును నిర్మలము చేయుచున్నావు | కీర్తనలు 66:10 |
| 836 | మా కాడి పలుపులను తెంపు దేవా | లేవి 26:13 |
| 837 | తన యందు భయ భక్తులు కలిగిన పిన్నలనేమి పెద్ధలనేమి ఆశీర్వదించు దేవా | కీర్తనలు 115:13 |
| 838 | ఇశ్రాయేలియులను ఆశీర్వదించు దేవా | కీర్తనలు 115:12 |
| 839 | అహరోను వంశస్తులను ఆశీర్వదించు దేవా | కీర్తనలు 115:12 |
| 840 | భూమ్యాకాశములను సృజించిన యెహోవా చేత మేము ఆశీర్వదింపబడితిమి | కీర్తనలు 115:15 |
| 841 | యెహోవా మమ్మును మా పిల్లలను వృద్ది పొందించుచున్నందుకు | కీర్తనలు 115:14 |
| 842 | నీ సేవకుని కుమారులు నిలిచియుందురు | కీర్తనలు 102:28 |
| 843 | నీ సేవకుని సంతతి నీ సన్నిధిలో స్థిరపరచబడును | కీర్తనలు 102:28 |
| 844 | నీ యందు భయ భక్తులు కలవారికి నీ కృప యుగ యుగములు నిలుచును | కీర్తనలు 103:17 |
| 845 | భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగానున్నదో ఆయన యందు భయభక్తులుగల వారికి ఆయన కృప అంత అధికముగానుండును | కీర్తనలు 103:11 |
| 846 | తండ్రి తన కుమారుల యెడల జాలి పడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును | కీర్తనలు 103:13 |
| 847 | మా పాపముల బట్టి మాకు ప్రతిఫలమియ్యక మా దోషములను బట్టి మాకు ప్రతిఫలమియ్యకయున్నందుకై | కీర్తనలు 103:10 |
| 848 | పడమటికి తూర్పు యెంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి యున్నందుకు | కీర్తనలు 103:12 |
| 849 | నిజముగా నీవు మా పక్షమునుండి మా పనులన్నింటిని సఫలపరచుచున్నందుకు | యెషయ 30:26 |
| 850 | తన ప్రజలకు బల పరాక్రమమును అనుగ్రహించుచున్నందుకు | కీర్తనలు 149:4 |
| 851 | తన ప్రజలకు సమాధానమును కలుగజేసి ఆశీర్వదించుచున్నందులకు | కీర్తనలు 148:14 |
| 852 | యెహోవా తన ప్రజల గాయము కత్తి వారి దెబ్బలు బాగుచేయు దేవా | యెషయ 30:26 |
| 853 | యెహోవా తన ప్రజలయందు ప్రీతిగల దేవా | కీర్తనలు 149:4 |
| 854 | తన ప్రజలకు ఒక శృంగామును హెచ్చించినందుకై | కీర్తనలు 148:14 |
| 855 | యెహోవా తన మందను దర్శించి వారిని అశ్వముల వంటి వారీగా చేయుచున్నావు | జకర్య 10:3 |
| 856 | తన ప్రజలను మంద వలె నడిపించుచున్న దేవా | కీర్తనలు 77:20 |
| 857 | యెహోవా స్వరము బలమైనది | కీర్తనలు 29:4 |
| 858 | యహోవా స్వరము ప్రభావము గలది | కీర్తనలు 29:4 |
| 859 | యహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును | కీర్తనలు 29:20 |
| 860 | యెహోవా స్వరము అరణ్యమును కదిలించును | కీర్తనలు 29:7 |
| 861 | యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది | కీర్తనలు 29:8 |
| 862 | యెహోవా స్వరము లేళ్ళను ఈనచేయును | కీర్తనలు 29:9 |
| 863 | నీ దక్షిణ హస్తము, నీ బాహువు, నీ ముఖ కాంతి మాకు విజయమును కలుగజేయును | కీర్తనలు 44:3 |
| 864 | యెహోవా కను దృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నందుకు | II దిన 16:19 |
| 865 | నీ ముఖకాంతికై | కీర్తనలు 44:3 |
| 866 | దుష్టమృగములుండు పర్వతము సౌదార్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు అందుకై | కీర్తనలు 76:4 |
| 867 | భూమ్యాకాశముల అంతట నున్న వాడవు | యిర్మియా 23:24 |
| 868 | సమస్తమును పూర్తిగా నింపుచున్న సంపూర్ణతయైయున్న దేవా | ఎఫెసి 1:23 |
| 869 | అలసియున్న వారి ఆశను తృప్తి పరచెదువు, కృశించిన వారినందరిని నింపుచున్న దేవా | యిర్మియా 31:24 |
| 870 | తన అభిశక్తునకు రక్షణ దుర్గమునై యున్న దేవా | కీర్తనలు 28:8 |
| 871 | తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగచేయు దేవా | I సముయేలు 2:10 |
| 872 | యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతికారము చేయును | కీర్తనలు 31:23 |
| 873 | హృదములనుఏకరీతిగా నిర్మించిన దేవా | కీర్తనలు 33:15 |
| 874 | మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించిన దేవా మీకు | జకర్య 12:1 |
| 875 | మనుష్యుల యోచనాలు వారికి తెలియచేయు వాడు ఆయనే అందుకొరకు | అమోసు 4:13 |
| 876 | మనుషులందరికి వారి వారి క్రియలను బట్టి ప్రతిఫలమిచ్చుచున్న దేవా | కీర్తనలు 62:12 |
| 877 | యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన్ దూత కావాలియుండి వారిని రక్షించు దేవా | కీర్తనలు 34:7 |
| 878 | నీ నామము నందు భయభక్తులు గల వారి స్వాస్త్యము నీవు నాకు అనుగ్రహించియున్నందులకై | కీర్తనలు 61:5 |
| 879 | విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు – నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును | కీర్తనలు 34:18 |
| 880 | నీవే కార్యము నెరవేర్చు వాడవు | కీర్తనలు 37:5 |
| 881 | బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను | కీర్తనలు 62:11 |
| 882 | ప్రార్ధన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు కాబట్టి | కీర్తనలు 65:2 |
| 883 | నీకు ఆసాద్యమైనది ఏదియు లేదు | యిర్మియా 32:27 |
| 884 | దేని కాలమందు అధి చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నీయమించియున్నాడు | ప్రసంగి 3:11 |
| 885 | ఆయన చెప్పిన యే మాటాయు నిరర్ధకము కాలేదు | లూకా 1:37 |
| 886 | నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము | మార్కు 14:36 |
| 887 | ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను ఆయన ఆజ్ఞ పంపగానే కార్యము స్థిరపరచబడెను | కీర్తనలు 33:9 |
| 888 | ప్రతి మోకాలును, నీ యెదుట వంగును. ప్రతి నాలుకాయు దేవుని స్తుతించును | రోమా 14:11 |
| 889 | నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది | కీర్తనలు 104:13 |
| 890 | నీవు కలుగ చేసిన వాటితో భూమి నిండియున్నది | కీర్తనలు 104:24 |
| 891 | నీవు భూతలమును నూతన పరచుచున్నావు | కీర్తనలు 104:30 |
| 892 | దేవా భూమిని దర్శించి తడుపుచున్నావు | కీర్తనలు 65:9 |
| 893 | దేవుని నది నీళ్ళతో నిండియున్నది | కీర్తనలు 65:9 |
| 894 | భూమి మొలకెత్తగా నీవి దాని నాశీర్వదించుచున్నావు | కీర్తనలు 65:10 |
| 895 | భూమిని యెహోవా కృపతో నింపియున్నాడు | కీర్తనలు 33:5 |
| 896 | భూమికి దాని సరిహద్దులను నీయమించిన వాడవు నీవే | కీర్తనలు 74:17 |
| 897 | భూదిగంతులను సృజించిన దేవా | యెషయ 40:28 |
| 898 | ఆకాశమందు తన కొరకై మేడగదులను కట్టుకొని, భూమి యందు పునాదులను వేయు వాడవు నీవే | అమోసు 9:6 |
| 899 | భూలోకమును కదలకుండా స్థిరపరచుచున్నావు | I దిన 16:30 |
| 900 | మహోన్నతుని దక్షిణ హస్తము మార్పునోంనొందెననుటకు నాకు కలిగిన శ్రమయే కారణము | కీర్తనలు 77:10 |



